సేవలు & సమయాలు
నిత్య పూజా సమయాలు
రుద్రవారాభిషేకాలు
ప్రతిరోజు స్వామివారికి శాస్త్రోక్తంగా జరిగే అభిషేకం
కుంకుమార్చన
అమ్మవారికి భక్తులచే జరుపబడే ప్రత్యేక అర్చన
పంచహారతులు
సాయంత్రం వేళ స్వామివారికి జరిగే దివ్య హారతి సేవ
మాస ఉత్సవాలు
మాస శివరాత్రి
మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, చండీ హోమం. సాయంత్రం 5:30 తర్వాత 1008 ఆవు నెయ్యి దీపాలతో సహస్ర దీపాలంకరణ సేవ మరియు 500 మందికి అన్నప్రసాద వితరణ.
పౌర్ణమి చండీ హోమం
ప్రతి నెల పౌర్ణమి రోజున అమ్మవారి ప్రీతి కోసం ప్రత్యేక హోమం
ఆర్ద్ర నక్షత్ర అభిషేకం
స్వామివారి జన్మ నక్షత్రం రోజున మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు
వార్షిక & ప్రత్యేక ఉత్సవాలు
కార్తీక మాస బ్రహ్మోత్సవాలు
నెలంతా ఏకాదశి రుద్రాభిషేకాలు. చివరి 3 రోజులు లక్ష బిల్వార్చన, 108 కలశాభిషేకం, మరియు సుందరంగా అలంకరించిన కళ్యాణ మూర్తుల గ్రామోత్సవం.
కార్తీక అమావాస్య - అన్నాభిషేకం
121 కేజీల అన్నంతో స్వామివారికి అన్నాభిషేకం, లక్ష కుంకుమార్చన మరియు రాత్రి కోనేటిలో హంస వాహనంపై దివ్య తెప్పోత్సవం.
దేవి శరన్నవరాత్రులు
త్రుకాల కుంకుమార్చనలు, చండీ పారాయణ, బాల పూజ మరియు సువాసినీ పూజలు.
దోష నివారణ పూజలు
ప్రతి ఆదివారం రాహు కేతువుల పూజలు విశేషంగా జరుగుతాయి. కాలసర్ప దోష నివారణ కోసం భక్తులు విశేషంగా తరలి వస్తారు.
సంతాన ప్రాప్తి
సంతానం లేని వారు 5 సోమవారాలు స్వామివారికి ప్రదక్షిణలు చేస్తే పుత్ర సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.